Bird flu: కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ కల్లోలంతో ఎమర్జెన్సీ విధింపు..! 3 d ago
అమెరికా రాష్ట్రం కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ కల్లోలం సృష్టిస్తోంది. 34 మందికి వైరస్ సోకింది. దాంతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు. దక్షిణ కాలిఫోర్నియాలోని డైరీ ఫామ్లోని ఆవుల్లో ఈ కేసులను గుర్తించారు. దానితో వైరస్ వ్యాప్తి దిశగా చర్యలు తీసుకుంటున్నామని గవర్నర్ గవిన్ న్యూసమ్ తెలిపారు. అయితే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వైరస్ సంక్రమించిన దాఖలాలు లేవని తెలిపారు.